Saturday, July 11, 2015

మనకవితలు టీమ్

విజేత...( TELUGU INSPRITATIONAL MESSAGE)

నా మస్తిష్కపు ఉద్యానవనంలో
ఆలోచనల పువ్వులను
నేను కోసుకుంటున్నవేళ
కోయబడని పువ్వుల పరిమళం
నా మీద వీస్తున్న వేళ

వీచే ఆ పువ్వుల పరిమళం
నాతో స్నేహం చెయ్యాలనుకుంది-

నేను నా వేషాన్ని తీసేశాను
పువ్వులు నన్ను సమర్థించాయి
వేషాన్ని తీసేసిన నేను
వాంఛల్ని కూడా తొసేశాను
పువ్వులు ఎంతో సంతోషించాయి

మౌనాని సాధించాను
ధ్యానాన్ని శ్వాసించాను


నాతో స్నేహం చెయ్యాలనుకున్న
వీచే పువ్వుల పరిమళం
దోషం లేకుండ ప్రయత్నిస్తోంది
సందేశాలెన్నో నాకు పంపిస్తోంది

అదుగో ఆకాశంలో
మహర్షుల ఉపదేశాలలగా మేఘాలు సాగుతున్నాయి
తమతో సమన్వయమవమని
నన్ను స్వాగతించాయి

ఇంకా పుష్పించని
ఒక పువ్వు అన్నది
"నా కోసం వేచి ఉండు" అని

నన్ను నేను
మినహాయించుకున్నను
విజేతనయ్యే విధానం
తెలుసుకున్నాను

రోచిష్మాన్

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
July 18, 2015 at 11:59 AM delete

Good to read this kind of small but heart touching...

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...