Thursday, July 23, 2015

మనకవితలు టీమ్

తనివి తీరా బ్రతుకుదాం ..( INSPRITATIONAL TELUGU KAVITHA )

నీళ్లలో సెగ పుడుతోంది
దాహం తీర్చుకుంటే
శోకం కలుగుతోంది

అగ్నిలా అంహస్సు
అంతటా వ్యాపిస్తోంది
అదే తంతుగా
అనృతం అనంతమౌతోంది

మంచితనమన్నది
మట్టికొట్టుకుపోతోంది
సంక్షేమమన్నది
వాడిపోయిన పువ్వైపోయింది

తప్పులవల్ల తప్పులతో మనం
తప్పులవైపు పయనిస్తున్నాం
తప్పుల్ని తప్ప మరేం సాధించగలం?

తప్పులతో మమేకమయ్యాం
తఱచి చూసుకుంటే
మనం తప్పుడు వాళ్లమైపోయాం

ఇన్నాళ్లలా
ఎన్నాళ్లిలా?






పొద్దు పొద్దుకూ
కొద్ది కొద్దిగానైనా మారదాం
వద్దనకుండా
దిద్దుబాటును అద్దుకుందాం


రానున్న రోజులలో
కానున్న వినాశనాన్ని తప్పించేద్దాం
మనమందరమూ
తనివితీరా బ్రతుకుదాం


రోచిష్మాన్

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
Happy Forever
AUTHOR
September 18, 2015 at 3:16 AM delete

Poddu podduku koddiganayina wow super super.... i loved it boss

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...