Tuesday, May 5, 2015

మనకవితలు టీమ్

మధురం . . . ! ! !

 కన్ను తెరస్తే జననం కనులు మూస్తే మరణం
 రెప్పపాటు జీవితం అప్రమతత్త అవశ్యం
 ప్రధమ రోదనం జననం హితుల రోదనం మరణం
అత్తా ..హే రామ్ లమచిత్రమైన ప్రయాణం

నిద్ర,నిద్రాణ మైన కలల కౌగిలి బాల్యం
స్వప్న లోకాల స్వైరకల్పన యౌవనం
సునామీలో చిల్లుపడ్డ నావగతి గార్హస్ధ్యము
సత్య శోధనకై వార్ధక్యంలో అక్షరాభ్యాసం . . . !!

సందేహాలు,సంవాదాల అలల మధ్య సంవర్తిక జీవితం
ఉన్నది పోయిందని పోతున్నది రానిదని
కోరినది లభించదని లభించినది కోరనిదని
లభ్యత అలభ్యతల అజాగళ స్తనభ్రాంతి జీవితం . . . !!

నిరంతరం మారే జగతికి నిమిత్తమై, నిత్యమై
నియతిగల జగతికి  నియంతయై, సత్యమై
నీలోనూ నీచుట్టూ అద్వైతమై ఆనందమైన
పరమాత్మను మదిలో ధ్యానించు  మధురమై జీవించు . . . !!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
బి.వి ఎల్ ఎన్ మూర్తి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
Anonymous
AUTHOR
May 6, 2015 at 12:38 AM delete

ఉన్నది పోయిందని పోతున్నది రానిదని
కోరినది లభించదని లభించినది కోరనిదని
లభ్యత అలభ్యతల అజాగళ స్తానభ్రాంతి జీవితం . . nachindi yee kavithvam

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...