Friday, May 1, 2015

మనకవితలు టీమ్

గాలి బాధ . . . ! ! !

తలుపులు మూసి ఖాళీగది అన్నారు
గదిలోపల నేనున్నాఉక్కిరిబిక్కిరి అవుతూ ఉక్కపోత భరిస్తూ!
పిల్లనగ్రోవిలోఊపిరాడకతిరుగుతూనేను విడిచిన
ఏడుపు మూలుగును సంగీతం అన్నారు
మనసుకు సంతోషం అన్నారు!

వర్షానికి తడుస్తానని భయపడి నేను పరుగుతీస్తుంటే
'ఈదురుగాలి ' అని ఈసడించుకున్నారు!
వేసంగి ఋతువులో వేడిచేసి నేను మూలనకూర్చుంటే
పంకాలతో లేపి పరుగు పెట్టిస్తారు వేడిగా ఉన్నానని వెర్రిత్తిపోతారు!
నాది ఈ జగం ,నాది ఈ యుగం
నా జగత్తులోనికి మీరు చొరబడ్డారు
నా ఉనికి లేకుంటే నిలువునా చస్తారు . . .!!!
gaalibaada telugu kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
అర్జున్*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

3 comments

Write comments
Anonymous
AUTHOR
May 1, 2015 at 1:40 PM delete

nice poem arjun gaaru varietypoem gaali (air) meeda try chesaaru. nice.... savitha..

Reply
avatar
Anamika
AUTHOR
May 2, 2015 at 11:43 AM delete

Arjun ,

Chala chaaala baaagundandi.......denigurinchaina cheppalanukunnappudu .....aaa subject/object maname ani feel ayyi raaase style naaaku chaala nachchutundi ......Keep it up...I would be waiting for your next kavita.........


Anamika

Reply
avatar
May 2, 2015 at 11:45 AM delete

Bhaadha baagundi . . .aalochana baagundi . . Bhaadha undi

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...