Sunday, May 10, 2015

మనకవితలు టీమ్

అమ్మ ప్రేమ . . . ! ! !

మారవు ఈ జీవిత కథలు,
తీరవు ఈ జీవన వ్యధలు ...,

ఒకవైపు మనసులలో దాగి ఉన్న మానవ మృగాలు రాబంధువులైపీక్కుతింటుంటే . . ,

మరోవైపు మనుసులు ప్ర్రణాలు ని వేలం వేసి మాతృప్రేమకే వెలకడుతున్నారు....

సుఖాలకి లోనై ఆ సుఖాలని అందజేసిన బంధాలనే మరచి జీవత్శవాలుగా మారుస్తున్నారు...

కడుపున పుట్టిన పిల్లలే ఆ కడుపును కాలుస్తుంటే కన్నీరైనా ఆ కడుపులోనే దాచుకొంటారు కన్నవాళ్ళు....


గోరుముద్ద పెట్టిపెంచిన బిడ్డలే గొడ్డలిగా మారి బాడిస్తుంటే  పోటును సైతం ప్రేమగా స్వీకరిస్తారు  మాతృమూర్తులు....

కాళ్ళులందకుండా కాపాడుకున్న కన్నబిడ్డలే కాలి ముల్లై దిగబడుతున్నా ముల్లును సైతం పువ్వులా స్వీకరిస్తారు ఆ ప్రేమమూర్తులు...

మారవు ఈ జీవిత కథలు,
తీరవు ఈ జీవన వ్యధలు ...,

మాతృదేవోభవా ......
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
గౌతమి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

3 comments

Write comments
Arjun .bumija
AUTHOR
May 11, 2015 at 10:53 PM delete

Chaaala baga rasaru... Super

Reply
avatar
Anonymous
AUTHOR
May 29, 2015 at 10:45 PM delete

nice one bro

Reply
avatar
ravi
AUTHOR
June 13, 2015 at 4:26 PM delete

Kavitha baagundi eesari amma gurinchi adbhutamgaa raayandi

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...