నీ ప్రేమలో ( telugu premikula roju kavitha 2015 )

2
1135

నిన్నే చూసిన నిమిషం మొదలు . ,
నీతో కలిసిన తరుణం మొదలు . . ,
నీదరహాసపు తాకిడితో నాలో తెలియని అలజడి మొదలు ….

చూపులు విసిరిన చిరుబాణాలు . ,
నీ నవ్వులు చేసిన మృదు గాయాలు . ,
ఒంటరిగున్నా , ఎందరు ఉన్నా నను వీడవులే నీ గుసగుసలు …

వింతలు చూపిన ఈ ఉదయాలు . ,
నను ఒంటరి చేసిన సాయంత్రాలు . . ,
నిను చూడాలని తొందర నాలో పెంచెను ఎన్నో కోరికలు ….

నా తోడై నువ్వుంటే చాలు . ,
నీ ప్రేమను పంచిస్తే చాలు . . ,
నిండుగ మనను దీవించేందుకు నేలకి దిగరా ఆ దేవతలు …
.
.
.
.
రామ్ …

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here