Sunday, February 1, 2015

మనకవితలు టీమ్

కరుణించవవా చెలి ...!!!

ఉదయ భాను కిరణాన్ని అడిగాను
నీవు ఎక్కడ వున్నావని  . . , 
చందమామను కోరాను
నీ చిరునామా చెప్పమని  . . ,
వీచే గాలితో రాసి పంపాను
నీకు ప్రేమ లేఖని. . ,
 చిరు జల్లును అడిగాను
చెలి  చెంతకు చేర్చమని . . ,
మరు మల్లియకు చెప్పాను
నా మనసు నీ దగ్గర వుంది అని . . ,
 కోయిలను కోరాను
నా ప్రేమ సరాగం నీకు వినిపించమని  . . ,
 పారే సెలయేరుకు  చెప్పాను 
నా కలల  రాణివి  నీవే అని . . ,
హరివిల్లుకు వివరించాను
నా సిరిమల్లెవి నీవే అని  . . , 
కరుణించవ  చెలి...
 కరుణించి  కనిపించవా  . . !
కనిపించి నా పై ప్రేమామృత వర్షం కురిపించవా ...!!
karuninchavaa cheli telugu love kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...