Wednesday, January 28, 2015

మనకవితలు టీమ్

పేరుకో కవిత . . . ! ! !

    హసినా . .!
నిన్ను తలచిన ఈ తరుణాన
నన్ను నేనే మరిచిపోతున్నా
నీ ఊహలు ఉన్నవి క్షణమైనా
అవి నిత్యం పలికెను ఇలా .. ఇలా ..
హసినా . .! హసినా . .! !


    నిరోష . . !!
నీ స్నేహం ఒక నిష
అది తియ్యని బాదుష
నాతో విధి ఆడిన వింత తమాష
మన స్నేహ సౌధానికి నువ్వే కులికుతుబ్ షా
నిరొష కావాలా ఆలు సమోస . . !!

    సరళ రాణి . . !!
సరళ వాక్కుల సుభాషిణి
సులేత నవ్వుల సుహాసిని
నీలి ముంగురుల శిరోమణి
మధుర సంగీత సుధ వీణా వాణి
కడదాకా ఇలాగే సాగనీ  మన స్నేహాన్ని
సరళ రాణి . . !!

       ఉష . . ! !
ఉషోతేజస్సుతో నిత్యం విరజిల్లుతూ
విరితేనీయ మాటల పలకరింపులు కురిపిస్తూ
స్నేహపూతోటలో మమ్ములను విహరింప జేస్తున్న
ఓ స్నేహ శీలి . .
తొలి ఉషోదయపు వెలుగుజిలుగులతో
పులకరిస్తూందీపుడమి . .
ఏ ఉష మాటల మధురిమలతో
వికసిస్తుంది మన చెలిమి. . . !!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
మనోజ్ శరకనం*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...