Tuesday, January 20, 2015

మనకవితలు టీమ్

మాత . . జన్మధాత (అమ్మ) . . . ! ! !

అయ్యో...! మాత , అయ్యో...! జన్మధాత
లోకం మారిన..నీ ప్రేమ మారదు....
ప్రళయం వచ్చిన నీ కరుణ తప్పదు.
ఏమిటమ్మ ఈ లోకం...!ఎందుకు? నికీ దుఃఖం.

కష్ట , సుఖాలను లెక్కించకుండా,
జన్మనిచ్చిన తల్లి నీవు....
సుతునిగా పుట్టినందుకు...
చిరు సంతోషాన్ని అలంకరించినావు.
నీ సుఖమే తన కోరికని....
భావించిన మాత నీవు.
ఆటంకాలెన్ని వచ్చిన...!
తట్టుకునే తటస్థితి అయినావు.


అడుగడుగునా  రక్షణను కల్పిస్తూ..
అమ్మ అని పిలవగానే...
నాన్న అని పలకరించి...
టక్కుటక్కున మాకు  చూస్తూ..
క్షణ కష్టాని తొలగిస్తూ....
మేధస్సు ప్రపంచంలో...,
మేధావిగా మార్చినావు .

సంపాదించే వయస్సులో...
జంటను కల్పించినావు.
చెప్పలేని కష్టాలను..
తొలగించిన  అమ్మ…! నీకు…
కంటి నిండా......!
దుఃఖ అశ్రువులే మిగిలించితిరా !!

అయ్యో...! మాత , అయ్యో...! జన్మధాత
ఏమిటమ్మ ఈ లోకం...!ఎందుకు? నికీ దుఃఖం.
maatha janmadhatha telugu kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
రాథోడ్ రవీందర్*
                       

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...