3 COMMENTS

  1. ధరణిని దాట లేనని తెలిసినా కెరటం ఆనందంతో ఎగిసి పడుతుంది
    తననే నమ్మిన నావను గమ్యం చేరుస్తుంది కనుక
    చినుకై రాలిపోతానని తెలిసినా మేఘం గర్వంతో గర్జిస్తుంది
    తన చినుకులు పంట చేలకు తెచ్చిన వన్నెని చూస్తుంది కనుక
    వాడి రాలిపోతానని తెలిసినా పుష్పం అందంగా విరబూస్తుంది
    తన సొగస్సు ఓ తనూలత పెదవులపై దరహాసాన్ని తెస్తుంది కనుక
    మరణిస్తానని తెలిసినా జీవి కేరింతలు కొడుతూ జన్మిస్తుంది
    తన చివరి స్వాసదాకా మమతల మధురిమ ఆస్వాదిస్తుంది కనుక
    మోసపోతావని వివరం తెలిపినా మనస్సు ప్రేమిస్తూనే ఉంటుంది
    నిస్వార్ధంగా ప్రేమించే మనస్సు తనని మోసగించదని నమ్ముతుంది కనుక !!!

  2. ఆశావాది. . నిరాశావాది. . . .నిలువెత్తు నిర్వచనం . .పై రెండు కవితలు . . .సమయానుకూలంగా రెండు కావాలి. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here