Saturday, November 8, 2014

మనకవితలు టీమ్

సృష్టి లయ . . . ! ! !

srusti laya telugu kavitalu on images
ఓ కెరటమా ఎగిరెగిరి పడతావెందుకే
ధరణి దాటలేవని తెలిసి కూడా . . !
ఓ మేఘమా గర్జిస్తావెందుకే
చినుకై రాలిపోతావని తెలిసి కూడా . . !
ఓ పుష్పమా పుష్పిస్తావెందుకే
నేల రాలిపోతావని తెలిసి కూడా . . !

ఓ ప్రాణమా జన్మిస్తావెందుకే
మరణిస్థావని తెలిసి కూడా . . !
ఓ మనసా ప్రేమిస్తావెందుకే
మోసపోతావని తెలిసి కూడా . . ! !
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సంద్య*
(డా.. శ్రీనివాసరావు కాశీసోమయాజుల)
                                                         
                                         

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

3 comments

Write comments
Sindoora
AUTHOR
November 18, 2014 at 7:54 PM delete

ధరణిని దాట లేనని తెలిసినా కెరటం ఆనందంతో ఎగిసి పడుతుంది
తననే నమ్మిన నావను గమ్యం చేరుస్తుంది కనుక
చినుకై రాలిపోతానని తెలిసినా మేఘం గర్వంతో గర్జిస్తుంది
తన చినుకులు పంట చేలకు తెచ్చిన వన్నెని చూస్తుంది కనుక
వాడి రాలిపోతానని తెలిసినా పుష్పం అందంగా విరబూస్తుంది
తన సొగస్సు ఓ తనూలత పెదవులపై దరహాసాన్ని తెస్తుంది కనుక
మరణిస్తానని తెలిసినా జీవి కేరింతలు కొడుతూ జన్మిస్తుంది
తన చివరి స్వాసదాకా మమతల మధురిమ ఆస్వాదిస్తుంది కనుక
మోసపోతావని వివరం తెలిపినా మనస్సు ప్రేమిస్తూనే ఉంటుంది
నిస్వార్ధంగా ప్రేమించే మనస్సు తనని మోసగించదని నమ్ముతుంది కనుక !!!

Reply
avatar
December 5, 2014 at 12:39 AM delete

ఆశావాది. . నిరాశావాది. . . .నిలువెత్తు నిర్వచనం . .పై రెండు కవితలు . . .సమయానుకూలంగా రెండు కావాలి. .

Reply
avatar
santosh kv
AUTHOR
January 9, 2015 at 11:13 PM delete

Chala chala bagundi...tq

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...