గోరంతదీపం . . . ! ! ! (ఓ ప్రేమికుడి ఆరాధన)

8
863

చీకటి నిండిన నా జీవితానికి
నువు కాంతి నింపావు తారాజువ్వై . . ,
 నను గమ్యస్తానానికి చేర్చేందుకై
కరుగుతున్నవు మైనం నువ్వై . . ,
నిన్నే నింపుకున్న నా హ్రుదయంలో
వెలుగుతున్నావు గోరంతదీపం నువ్వై . . ,

నీ ప్రేమతో నాలో వెలుగును నింపి
మిగులుతున్నవు చీకటి నువ్వై . . ,
విజయ తీరాన నిలిపేటందుకు నాలో
నిండిపోయావు స్పూర్తివి నువ్వై . . ,
నీ ప్రేమ మైకాన నను ముంచేసి
నను వీడి పోవద్దు జాబిలి నువ్వై . . . ! ! !
.
.
.
.
.
.
.
.
.
.
.
.
రామ్**     

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here