Tuesday, September 30, 2014

మనకవితలు టీమ్

ఆత్మీయ – క్షణాలు . . . ! ! !

athmiya xanalu telugu kavitalu on images

     **(I am dedicating this poetry to my parents)**
ప్రేమకు రూపమై, దివ్యలోకంలో మాతృదేవత గర్భంలో ఉద్భవించాను.
రెప్పచాటు కలనై, నిదిరించువేళలో, తొలిస్పర్శతో కదిలాను.
ఆత్మీయలోకంలో కాంతినై,నిండుజీవితాల్లో చిరునవ్వులా మారాను.
అద్వితీయమూర్తులకు బిడ్డనై,అందాల ప్రపంచంలోకి అడుగుపెట్టాను.

మమతల కోవెలలో,అనురాగమూర్తుల ఒడిలో పెరిగాను.
ముద్దుమాటలతో,ముత్యాలపందిరిలో బుడిబుడి అడుగులతో నడిచాను.
అమ్మ - నాన్న అను మాటలే తొలిఅక్షరాలుగా విద్యానరంభించాను.
ఆచార్యదేవోభవ అంటూ గురువులకు నమస్కారించి,సంస్కారాన్ని నేర్చాను.

మమకారమనే మాథుర్యంలో గడిచిపోయాయి కొన్నిరోజులు
కాలం మారిన కనుమరుగవనివి మరికొన్ని ప్రతిబింబాలు
ఎంత ఎదిగిన నిత్యం మెదిలేవి ఆత్మీయ - క్షణాలు
మదిలో పదిలంగా దాచాను ఆ మథుర ఙ్ఞాపకాలు

హృదయంలో నిలిచిన ఆ తీపిగుర్తులే ఎలప్పుడు నా నేస్తాలు..
జ్వలించే గుండెల్లో దాచిన,కడవరకు విడిపోనివి అనుబంథాలు
అనునిత్యం నానిండు కళ్ళల్లో వెలిగే కాంతులే తల్లిదండ్రులు.
వారి క్షేమాన్నే కాంక్షిచే ఆలోచనలే నా ఆశయాలు.

ఆశయసాధనకై అలుపెరుగని మౌనపోరాటమే నా ధ్యేయం
సహాయంకోసం వేచే వారి జీవితాల్లో ,ఆనందాలు నింపడమే లక్ష్యం
ఆలోచనాలకు రూపన్ని ఇచ్చి,అవరోథాలు దాటడమే కర్తవ్యం
అందరి జీవితాల్లో చిరునవ్వులా మారినప్పుడే నా జన్మధన్యం…!!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
పార్వతి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
Gopala Gopala
AUTHOR
March 25, 2016 at 5:52 PM delete

adbuthanga undi chaal chaala

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...