Friday, August 29, 2014

మనకవితలు టీమ్

విగ్న రాజ నీకు నీరాజనం . . . . ! ! !

vinayaka chathurdi telugu kavitha on images

పార్వతి తనయ   పరమ పవిత్ర హృదయ 
ఆది దేవా నీ పుట్టిన రోజు లోకమంతటికి  పండగయ ....!!!

సర్వకార్య శుభప్రద  సిద్ది వినాయక అందుకోవయ్య 
గణాదిపతి  గణపతి దేవా మా గణమైన నీరాజనం అందుకోవయ్య ..!!!

విఘ్నాలను తొలగించి విజయాలను అందించే వినాయక నీకు ఉండ్రాళ్ళ నీరాజనం ..!!!
లంభోదర ముశీకా వాహన నీకు  మారేడు నీరాజనం ...!!


అజ్ఞానాన్ని రూపుమాపి విజ్ఞానాన్ని అందించే   విఘ్న రాజ నీకు ఫల పుష్ప నీరాజనం ...!!!
నిర్విఘ్న నిరాడంభర  నీకు నారికేల్ల  నీరాజనం ...!!

సకల సౌక్యాలను నొసగే కరి వదన సకల శుభాల నోసగే ఏక దంత నీకు  వెలగ పండ్ల నీరాజనం ...!!!
వక్రతుండ  మహాకాయ  నీకు మంగళ హారతి  నీరాజనం ...!!

ప్రధమ పూజలందే దేవ దేవ సిద్ది భుద్ది ప్రదాయ  శుభ చరన  నీకు పాయసం నీరాజనం ....!!!
మహా గణపతి  మహామతి  ముక్తిదాయ నీకు ముత్యాల నీరాజనం ...!!
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...