Tuesday, August 12, 2014

మనకవితలు టీమ్

నిశీధిలో నిరీక్షణ . . . ! ! ! (ప్రేమికుడి కోసం వేచి ఉన్న అమ్మాయి ఫీలింగ్స్)

telugu premakavitalu on images

నిశీధిరాత్రిలో వేచిన నా మనసు నీ వెలుగును చూడాలని ఆరాటపడుతోంది..!
మిన్నంటి ఆకాశాన జాబిల్లిలో నీ మోమును చూసి సంబరపడుతోంది..!
ఈ సమయం చిరుగాలి స్పర్శలా తాకి ఊహాలతీరానికి ఆహ్వానిస్తోంది..!
అనంత తారలసముహాంలో నక్షత్రంలా మారి నిను చేరలనివుంది..!
అల్లంతా దూరలలో చేతులుచాచి నీవు చూస్తుంటే,
చిరునవ్వులా నీకై రావాలనివుంది..!
పరిమళించే పుష్పాలు వికసించేవేళలో,
నా గుండెచప్పుడు నీకు తెలపాలనివుంది..!

కలయా!నిజమా అని నేను ప్రశ్నించుకుంటున్నా,
ఆ కలను వీడి కనిపించే నిజమై వస్తావని మది చెబుతోంది..!
వెన్నెలకోసం ప్రతిరోజు వెతికే ఈ హృదయం,
కాలం కాసేపు ఆగిన నిన్నే చూడమంటోంది..!
నీ ఊసులతో,
నా అభిరుచులతో చేస్తున్నా ఈ ప్రయాణం..!
ఓ అద్భుతఘట్టంలా మారే క్షణాలకోసం..!
నిను వెతికే స్వప్నంలో వేచివుంటా నీకోసం..!
ఆశతో జీవిస్తా నిను కలిసే ఆ మధురక్షణాలకోసం..!!!
.
.
.
.
.
.
.
.
 పార్వతి*    

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...