ఎడారి వంటి జీవితానికి
ఒయాసిస్ వంటిది స్నేహం …!!!
శిశిరం లో చిరుజల్లుల
మోడువారిన జీవితాన్ని చిగురింప చేసేది స్నేహం …!!!
నిరాశ నిస్పృహతో వున్న జీవితానికి
అమృత తుల్యమైన అనురాగాన్ని అందించునది స్నేహం …!!!
గమ్యమే లేకుండా సుడిగాలిలా వున్న జీవితానికి
చిరు గాలిలా మనసుకి తాకి స్వాంతన చేకుర్చేది స్నేహం …!!!
ఆకాశానికి హరివిల్లులా
జీవితానికి రంగుల కలలను నింపేది స్నేహం …!!!
అమావాస్య చీకటిలో వున్న జీవితానికి
పౌర్ణమి వెన్నల పంచునది స్నేహం …!!!
.
.
.
.
.
.
.
.
.
సవిత*