Friday, August 22, 2014

మనకవితలు టీమ్

"అలల కలల నడుమ గులాభిరేకుల జేవనయానం". . . !!!

jeevitham telugu kavitha on images

శిధిలమయ్యే ధేహంపై తీరని మోహం
 ఊహల పరికల్పనలో విహరించే చిత్తం..!

అదిరిపోయే అధరా కోసం
చెదిరిపోయే దృశ్యాల కోసం స్వప్నించే కళ్ళు..!

కనుమరుగైపోతున్న మానవత్వాల కోసం
మంచుముక్కలా కరిగిపోయే రుచుల కోసం ఉన్వీళ్లూరే జిహ్వ..!

క్షణికమైన సుఖం కోసం అనుక్షణం పరితపించే కామాందుల దురహంకారం..!
మమతానురాగాలను మరచి వెంటరాని సిరిసంపదలకై వెంపర్లాడే బుద్ది..!


తారతమ్యం తెలియని తాత్కాలిక భోగవిలాసాల కోసం
తహతహలాడే తనువు..!

అందమనే మకరందం కోసం అందని తారల వెంట పరుగులుతీసే అంతరంగం..!
పోయేటప్పుడు వెంటరాని పనికిమాలిన పేరుప్రతిష్టలకై ప్రాకులాడే ఆహం..!

శాశ్వతమైన మానవ సంబంధాలను తృజించి
అశాశ్వతమైన అనుబంధాలకై ఆరాటపడే హృదయం..!

రెప్పతెరిస్తే జననం-రెప్పమూస్తే మరణమని తెలిసీకూడా
ఈ దుర్భరప్రాయమైన బ్రతుకుపై తరగని బ్రాంతి..!

"అర్ధం"(money) తోనే పరమార్ధమున్నదని భావించే
అర్ధంకాని పరమాత్మపై వీడని ఆపేక్ష..!

ఇదే అలల కలల నడుమ గులాభిరేకుల జేవనయానం"..!
ఇదే ఇదే ఓ జీవన సదృశ్యం..
అస్ఠిర జీవన సత్యానికి సజీవ చిత్రం...!!!
.
.
.
.
.
.
.
.
.
.
సంధ్య* (డా|| శ్రీనివాసరావు కాశేసోమయాజుల) 

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...