Wednesday, July 23, 2014

మనకవితలు టీమ్

తెలుసుకోలేమా ... !!!( inspirational Telugu kavitha in telugu!)

inspirational telugu kavita on images

చిట్టి చీమను చూసి  నేర్చుకోలేమా
కష్టించి పనిచేయడం ఎలాగో..!

కొవ్వొత్తిని చూసి అలవర్చుకోలేమా
త్యాగంలో ఉన్న గొప్పతనమెంతో ..!

పడిలేచే కడలి కెరటాలను చూసి గ్రహించలేమా
పడినా కూడా తిరిగి ప్రవహిస్తూ పరుగులు తీయడమెలాగో..!

విరిసే కుసుమాన్ని చూసి వివరించలేమా
వాడిపోతా అని తెలిసినా పరిమళాను వెదజల్లుతూ
పరులకోసం పాటుపడటం ఎలాగో...!

చెట్టుని చూసి చెప్పలేమా
తాను ఎండలో ఉంటూ నలుగురికి నీడనిస్తూ
నిగర్వంగా నిలబడటం ఎలాగో ...!

వీచె గాలని చూసి విలువ తెలుసుకోలేమా
నిశ్వార్ద సేవకు నిదర్శనం అంటే ఏమిటో ...!

పండువెన్నెలను పంచే చందమామను చూసి గ్రహించలేమా
పరులకోసం సాయపడటంలోని పరమార్దం ఏమిటో ...!

అస్తమించే సూర్యున్ని చూసి అర్దం చేసుకోలేమా
ఆశే శ్వాసగా రేపటికోసం ఎదురుచూస్తూ జీవించడమెలాగో...,,!!
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
ramesh babu.Y
AUTHOR
July 29, 2014 at 10:12 PM delete

nice medam

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...