జీవితమనే పుస్తకం లో గతమనే నిన్నటి పేజిని . .,
ఊహకైన అందని రేపటి పేజిని పదిలంగా దాచిపెడుతూ . . ,
వచ్చేను జయ నామ సంవత్సరం కాంతి వంతంగా …!!!
కొత్త ఆశలను చిగురింప చేస్తూ . . ,
కొత్త ఊహలకు ఊపిరి నింపుతూ . . ,
కొత్త సంవత్సరం వచ్చెను నిత్య నూతనంగా …!!!
అనురాగ ఆప్యాయతలను అలంకరించుకొని . . ,
కుల మత వర్గ అసమానతలను తొలగించుకొని . . ,
స్నేహ భావాన్ని పెంపొందించుకొని . . . ,
మనసార ఆహ్వానిద్దాం ఈ ఉగాదిని చిరునవ్వుతో వెలిగే చిరుదివ్వేగా..!!
.
.
.
.
.
.
సవిత . . …