Monday, August 26, 2013

Ram babu

వయసు . . . . . . . . !

vayasu telugu kavithalu submitted by Vishwanath Ayyalasomayajula telugu messages kavithalu sms
¤ ఆట పాటలే ఆలంబనముగ . ,
ముద్దు మురిపాలె ఆస్తిపాస్తులుగ . ,
సదా సంతోషముతో కేరింతలిడుతూ . ,
అరమరికలెరుగని నైజంతో . ,
భువిపై నడిచే దేవతల వలే . ,
కల్ముష రహిత మనస్సుతో . ,
బాధ్యతల బంధనములు లేని . ,

బాల్యమెంత మధురమో కదా . . . . !

జగమంతయు మనోహరముగా తోచి . ,
పడుచు పరువములు ఉఛ్వాసములు పెంచ . ,
ఓర చూపు సోకి ఒడలు వెచ్చ బడి . ,
తోడు కొరకు తనువు తహ తహ లాడ . ,
పరవశమున పరవళ్ళు త్రొక్కుతూ . ,
అవధులు లేని ఆవేశముతో . ,
ఆకాశమే సరిహద్దుగా నెంచు . ,
యవ్వనమెంత అపురూపమో కదా . . . . !

రెక్కలుడిగిన వయసులో . ,
సంసార బాధ్యతలు అధికమించి . ,
మలి సంధ్య మలుపులో . ,
తొలినాటి జ్ఞాపకాలు తలచి . ,
బరువెక్కిన గుండెలతో . ,
తనవారి ఆదరణకై తహ తహలాడ . ,
బిడ్డలొచ్చి బాసటగా నిలచిన . ,
వానప్రస్ఠము కూడ ఇంద్రప్రస్ఠము కాదా . . . . !
.
.
.
.
.
.
Submitted By
--విశ్వనాథ్ అయ్యలసోమయాజుల ¤


www.manakavitalu.blogspot.com

&

www.ram4u.heck.in

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...