Monday, January 14, 2013

Ram babu

సంక్రాంతి శుభాకాంక్షలు (హ్యాపీ సంక్రాంతి) 2013. . . . . . !

¤ తెల్లవారు తొలి కోడి కూతతో . . ,
నిదుర లేచిన పల్లె సీమలో . . . !
వాకిట నిలిచిన బసవన్నలతో . . ,
హరిదాసుల ఆలాపనతో . . . !

ఇంటికి వచ్చిన కొత్త అల్లుల్లతో . . ,
చిన్నారుల కేరింతలతో . . . !
భోగి మంటల వెచ్చదనంతో . . ,
పిండి వంటల కమ్మదనంతో . . . !
పల్లె అందాల సోయగాలతో . . ,
పడతులందరూ పోటీ పడగా . . . !

ముంగిలిలో వెలసిన ముగ్గుల క్రాంతి . . ,
తొలగాలంటూ మన మదిలో భ్రాంతి . . . !
ఆనందాలే తన ఆస్తనిపించి . . ,
వచ్చేసిందోయ్ మనకై సంక్రాంతి . . . !

మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు (హ్యాపీ సంక్రాంతి) . . . !
.
.
.
.
.
మీ రామ్ ¤

www.manakavitalu.blogspot.com
&
www.ram4u.heck.in




Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...