Saturday, November 17, 2012

Ram babu

బాధల బడి . . . . . . !

¤ నవ్వుల పువ్వులు విసిరావమ్మా . . ,
నా మనసుకు మాటలు నేర్పావమ్మా . . . !
మాటల మంత్రం వేశావమ్మా . . ,
నా చూపులు నీపై నిలిపావమ్మా . . . !
ప్రేమతో నన్ను పిలిచావమ్మా . . ,
నీ ప్రేమతో నన్ను మలిచావమ్మా . . . !

నా కనులకు నీ కలలను చూపి . . ,
ఆ కలలే ఇక నా నిజమనిపించి . . . !
నా అడుగుకు నువ్వే గమ్యం అంటూ . . ,
ఆ గమ్యమే ఇక నా గెలుపని అంటూ . . . !

మరుపనే మాటను వలచావమ్మా . . ,
నాతో చేసిన భాషలు మరిచావమ్మా . . . !
మనసును ముక్కలు చేశావమ్మా . . ,
నను బాధల బడిలో చేర్చావమ్మా . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤
www.manakavitalu.blogspot.com
&
ram4u.heck.in







Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...