Wednesday, August 15, 2012

Ram babu

నా దేశమా (Happy Independence Day). . . . . !


¤ చెరగని నవ్వుల భారతమా . . . !
తరగని సిరులే నీ వశమా . . . !
మమతను పంచే మందిరమా . . . !
మానవతకు మరు చిరునామా . . . !


నీ బిడ్డలే నిన్ను కాదన్నా . . . !
నిన్ను ఒంటరిని చేసి వలస వెళ్ళినా . . . !
పాలు తాగి ఆ తల్లి(నీ) రొమ్మునే పాల పంటితో గాయపరిచినా . . ,
మమత పంచి నువ్వు పెంచిన బిడ్డలే మరల నీలోన కలిసి పోయినా . . . !


దేశ భక్తితో నిన్ను కొలిచినా . . . !
దుష్ట బుధ్ధితో నిన్ను చెరిచినా . . . !
నిన్ను కాచు నీ కన్న బిడ్డలే నెత్తురోడుతూ కన్ను మూసినా . . ,
నువ్వు కన్న నీ కన్న బిడ్డలే నిన్ను అంగిట అమ్మివేసినా . . . !


చెరగనీవు చిరు నవ్వు మోమున . . . !
నిను ఎవరు ఎంతలా హింస పరిచినా . . . !
తీరిపోదు ఋణము నిన్ను ఎంతలా కొలిచినా . . ,
తక్కువేనేమో నీకు నా ప్రాణమర్పించినా . . . !
।। చెరగని నవ్వుల భారతమా . ,
తరగని సిరులే నీ వశమా . ! ।।
।। భారత్ మాతాకీ జై ।।
.
.
.
.
.
 రామ్ ¤

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...