Tuesday, August 7, 2012

Pandu

నువ్వు . . నేను . . . ప్రేమ . . . . . . !

¤ పండు వెన్నెల చంద్రుని కిరణాలని చూస్తూ నువ్వు . . ,
మనసులోని ప్రేమను కళ్ళలో నింపుకొని చందమామలాంటి నిన్ను చూస్తూ నేను . . . . !
నీ చుర చుర చూపులతో నా అణువణువూ తాకుతూ నువ్వు . . ,
నీ చూపుల తాకిడితో ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక నేను . . . . !
కురిసీ కురియని నీ దరహసపు చిరు ఝల్లులతో నీ ప్రేమను తెలియజేస్తూ నువ్వు . . ,
నీ ప్రేమను ఎలా స్వీకరించాలో తెలియని అయోమయంలో నేను . . . . !
నాపై నీకున్న ఆరాధనని తెలియజేయయలేని నిస్సహాయతలో నువ్వు . . ,
నీ ఆరాధన అర్థమయినా అందుకోలేనంత దూరంలో నేను . . . . !
ఈ నిండు జాబిలి సాక్షిగా నువ్వు నేను ఎప్పటికైనా కాగలమా మనం . . . . . . . !?!
.
.
.
.
.
.
పండు ¤
www.manakavitalu.blogspot.com



Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
cnu
AUTHOR
October 20, 2013 at 11:14 PM delete

nice chala bagundhi, feel kuda ...

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...