Wednesday, June 13, 2012

Pandu

వెలసిపోయిన ఊహలు . . . . . !

¤ ప్రశాంతమైన నా జీవితంలోకి . . . ,
చిరునవ్వులా తోంగిచూశావు . . . . !
స్నేహమంటే తెలిసిన నా మనసుకి . . . ,
ప్రేమని పరిచయం చేశావు . . . . !
ప్రేమంటే తెలియని నాకు . . . ,
ప్రేమామృతాన్ని రుచి చూపించావు . . . . !
నావాళ్ళందరికీ నన్ను దూరం చేశావు . . . . !
బాధే తెలియని నా కళ్ళకి . . . ,
కన్నీటిని పరిచయం చేశావు . . . . !
నీకు దూరమైన నా జీవితంలో . . . ,
చిరునవ్వే లేకుండా చేశావు . . . . !
నా ప్రపంచం నువ్వే అనుకునేలా చేశావు . . . . !
నీ ప్రేమలో లోకాన్ని మరిపించావు . . . . !
గడిచిపోయిన నాకిష్టమైన రోజులు తిరిగిరావు . . . . !
నాదికాని ఈ వర్తమానం నాకవసరం లేదు . . . . !
నేను ఊహించిన భవిశ్యత్ నాకందించగలవా ప్రియతమా . . . . !
.
.
.
.
.
.
పండు ¤

www.manakavitalu.blogspot.com









Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...