ఎవరివో చెలి నీవెవరివో . . . . . !

0
154

¤ ఎవరివో చెలి నీవెవరివో . . . . . . !

ఊపిరొచ్చిన బాపూ బొమ్మవో . . . . !

ప్రాణం పోసుకున్న ఖజరహో శిల్పానివో . . . . !

హొయలు పొంగి పారే సన్నని సెలయేరువో . . . . !

ఝల్లు పడ్డ వేల విరిసిన ఇంద్రధనస్సువో . . . . !

మనసును రంజింపచేసే వసంత కోకిల గానానివో . . . . !

దివి నుండి దిగివచ్చిన దేవకన్యవో . . . . !

లేక నాకై పుట్టిన నా దానివో . . . . !

ఎవరివో చెలి నీవెవరివో . . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤

www.manakavitalu.blogspot.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here