Sunday, June 17, 2012

Pandu

నా రాముడు . . . . . . !

¤ నాకు తెలియదు నేను కవిత రాయగలనని . . . ,
నువ్వు పరిచయమయ్యే వరకు . . . . !
నాకు తెలియదు నాలో కోపం, స్వార్థం ఉన్నాయని . . . ,
నీతో చెలిమి చేసేవరకు . . . . !

నాకు తెలియదు ప్రేమంటే ప్రాణమని . . . ,
నీతో ప్రేమలో పడే వరకు . . . . !
నాకు తెలియదు నరకం ఎలా ఉంటుందో . . . ,
నీకు దూరమయ్యే వరకు . . . . !
నాకు తెలియదు బంధాల విలువ . . . ,
నీవు చెప్పే వరకు . . . . !
నాకు తెలియదు జీవితమంటే కష్టం, సుఖం రెండూ అని . . . ,
నీవు వివరించే వరకు . . . . !
నాకు తెలియదు లోకం తీరు . . . ,
నీవు అవగాహన కల్పించే వరకు . . . . !
కానీ నాకు తెలుసు రాయిని అహల్యగా మార్చిన వాడు శ్రీరాముడని . . . ,
నాకు తెలుసు నన్ను నాకు కొత్తగా చూపించిన వాడు నా రాముడని . . . . !
.
.
.
.
.
పండు ¤
www.manakavitalu.blogspot.com






Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
Anonymous
AUTHOR
June 21, 2012 at 7:36 PM delete

Hai me kavitalu chala bagunnayi.
Evarinaina preminchara ?

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...