Thursday, June 14, 2012

Pandu

మధుర స్వప్నం . . . . . !

¤ జల జల పారే నీటి ప్రవాహం నురగల మధ్య . . . ,
నీ నవ్వు చూశాను . . . . !
కోయిలల కిలకిల రావాల కమ్మని గొంతులతో కలిసి . . . ,
నీ స్వరం వన్నాను . . . . !
సాయంత్ర వేళ స్వఛ్ఛమైన గోధూళి మధ్య గోమాతల సాక్షిగా . . . ,
నీతో కలిసి నడిచాను . . . . !
పచ్చని పంట పొలాలలో చల్లగా తకే పిల్లగాలులతో కలిసి . . . ,
నీ స్పర్శను ఆశ్వాదించాను . . . . !
కమ్మని మట్టి వాసనతో మొదలైన చిరుఝల్లుల గిలిగింతల మధ్య . . . ,
నిన్ను హత్తుకున్నాను . . . . !
పున్నమి రోజు పండువెన్నెలను కురిపిస్తున్న చంద్రుని చూస్తూ . . . ,
నా అధరాలు నీకందించాను . . . . !
ప్రశాంతమైన రేయిలో నాకిష్టమైన నీ గుండెలపై ఒదిగి . . . ,
హాయిగా నిద్రపోయాను . . . . !
నీవెవరో అర్థంకాక చూస్తున్న అందరికీ . . . ,
నవ్వు నావాడివని సిగ్గుతో చెప్పాను . . . . !
నిద్రలేపిన కోడికూత ఈ మధురానుభావాలన్నీ స్వప్నమని తెలియ చెప్పింది . . . . !
నీకోసం నీతో ఈ మధురానుభావాల కోసం నా మనసు వేయి కళ్ళతో ఎదురుచూస్తుంది . . . . !
.
.
.
.
.
.
పండు ¤
www.manakavitalu.blogspot.com








Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...