నీ తలపు తాకిన నాలో . . . . . !

2
289

¤ నరకానికి అర్థం తెలియదు కానీ . . ,
అందులో ఉండే బాధను చూశాను నీ విరహంలో . . . . !

ప్రేమంటే తెలియదు కానీ . . ,
అది మిగిల్చిన ఒంటరితనాన్ని చూశాను నీ ఎడబాటులో . . . . !

స్వర్గమంటే తెలియదు కానీ . . ,
అది పంచే హాయిని చూశాను నీ చెలిమిలో . . . . !

కలలు కనడం తెలిసినా కానీ . . ,
అందులో ఉండే కమ్మదనాన్ని చూశాను నీ పరిచయంలో . . . . !

మాటలు ఎన్ని ఉన్నా కానీ . . ,
అవి మూగబోవడం చూశాను నీ మౌనంలో . . . . !

పదములు ఎన్నో వ్రాశాను కానీ . . ,
అవి కవితగా మారడం చూశాను నీ తలపు తాకిన నాలో . . . . !
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤

www.manakavitalu.blogspot.com

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here