నా చెలియా . . . !

0
162

¤ నిన్ను తలచి వేచిన వేళ . . ,
వలచి వచ్చిన ప్రేమను చూశాను . . . !
నన్ను విడిచి వళ్ళిన వేళ . . ,
ఒంటరైన వలపును చూశాను . . . !
చెలియ చిన్ని నవ్వులోన . . ,
కోటి తారల కాంతిని చూశాను . . . !
చెలియ చిన్నబోవు వేళ . . ,
మూగబోయిన నా మనసును చూశాను . . . !
చెలియ తోడు చెలిమి కోరి . . ,
ఉరకలు వేసిన గుండెను చూశాను . . . !
చెలితో సాగిన సావాసంలో . . ,
నన్ను నేనే కొత్తగా చూశాను . . . !
కోటి ఆశల కోటకట్టుకొని . . ,
చెలియకై జీవిస్తున్నాను . . . !
వలపు వాకిట విరులు పరిచి . . ,
చెలియకై నే చూస్తున్నాను . . . !
.
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤

www.manakavitalu.blogspot.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here