మనసులోని ఊసులు . . . . !

0
148

¤ తళుకుమన్న తార నాకై . . ,
వచ్చెనేమో నింగి విడిచి . . . !
నిండు పున్నమి జాబిలమ్మే . . ,
ఎదుట నిలిచే మిన్ను మరచి . . . !
నేను కోరే గమ్యమేదో . . ,
చెంతచేరే నన్ను మెచ్చి . . . !
ఓటమన్నది చంత చేరదు . . ,
నివు చెంతనుంటే నన్ను వలచి . . . !
మనసులోని ఊసులన్నీ . . ,
కవితలాయే నిన్ను తలచి . . . !
మాటలన్నీ మూగబోయే . . ,
నీ ముగ్ధమోహన మోము చూచి . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤

www.manakavitalu.blogspot.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here